విపరీతమైన ఆనందం కలిగినా, భరించలేని హృదయ వేదన కలిగినా, చివరికి తట్టుకోలేని చిన్న దెబ్బ తగిలినా ముందుగా ఆ భావాన్ని వ్యక్తీకరింపజేసేవి కళ్ళు. ప్రేమికులు కళ్ళల్లో కళ్ళు కలిపి చూసుకోవడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కొందరు వారి మనోభావాల్ని కళ్ళతో వ్యక్తీకరిస్తూ ఉంటారు. తప్పుచేసిన వాళ్ళు కళ్ళు తత్తర పడుతు వుంటాయి. ఎందరో కవులు కళ్ళమీద ఎన్నో పాటలూ, గేయాలూ రచించారు. అంతెందుకు ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా కళ్లు చూసే మాట్లాడుతూ ఉంటాం. అందుకు సర్వేందరియాణాం నయనం ప్రధానం అన్నారు. మన శరీరంలో కళ్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుల్లో కొందరికి కళ్ళు ఎంతో అందంగా ఉంటాయి. వారికి కనబడదు అనే విషయం చేప్తేనే గానీ తెలుసుకోలే, ఇటువంటి కళ్ళ గురించి సౌందర్య సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చిట్కాలు చూద్దాం. ముందుగా కళ్ళ చుట్లూ వలయాకారంగా ఏర్పడే నల్లని వలయం గురించి తెలుసుకుందా. ఇది స్త్రీలలో సాధారణంగా అందరికీ వచ్చే సమస్య దీనివల్ల కళ్ళ అలసటగా ఉన్నట్టు, డిఫ్రెషన్ కి లోనయినట్లు, ముసలితనం వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఇలా రావడానికి కారణాలు అతి చిన్నవి. వేళకి సరైన నిద్రలేకపోవడం సమస్యలు, స్ట్రెస్ , బాధ్యతలతో, ఇంటి సమస్యలతో అధికంగా ఆలోచిస్తూ ఉండడం, వంశపారపర్యంగా శరీర దారుఢ్యం లేక బలహీనంగా ఉండటం, అదే విధంగా వంశానుక్రమంలో ఏదో ఒక వ్యాధి సంక్రమించడం, వాతావరణ మార్పులు కారణంగా వచ్చే ఎలర్జీ మొదలైనవి. అయితే దీనివల్ల కంగారు పడవలసిన అవసరం లేదు. ఆల్మండ్ ఆయిల్ ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా కళ్ళ చుట్టూ రాస్తూ ఉంటే నల్లజీరలు పోయి, అక్కడ చర్మం మృదువుగా తయారవుతుంది. ఉపయోగించిన టీ పొడిని పల్చటి గుడ్డలో కట్టి, కళ్ళ చుట్టూ రాస్తే నలుపు పోతుంది. పచ్చి ఆలూగడ్డ బంగాళదుంప ముక్కని కళ్ళ చుట్టూ ఉన్న నల్లని వలయానికి రాస్తూ ఉంటే ఆ నలుపు పోతుంది. మెంతులు నానబెట్టి ముద్దగా చేసుకుని పాలలో కలిపి కళ్ల చుట్టూ పట్టిస్తే నలుపు పోయి కళ్ళు ప్రకాశవంతంగా అవుతాయి. కీరో దోసకాయ రసాన్ని గానీ, బంగాళదుంప రసాన్ని గానీ, దూదితో నల్లబారిన కళ్ళ చుట్టూ రాయడం వల్ల కళ్ళ భాగంలో ఏర్పడ్డ నలుపుపోయి, నునుపుగానూ, ప్రకాశవంతంగా మారతాయి. ఖీరదోసకాయ సన్నని చక్రాలా కోసి, ఫ్రిజ్ లో ఉంచి, ఆ చల్లని ముక్కలు కంటిమీద పెట్టుకుని, 5-10 నిమిషాలు వుంటే, కళ్ళ చుట్టూ ఉన్న నునుపు వలయం పోయి, కళ్ళ బరువు తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రకూడా పడుతుంది. ముద్దనందివర్ధనం పువ్వు కంటికి రాసుకుని, అలాగే కొద్దిసేపు ఉంచుకుంటే కళ్ల తేటగా అవుతాయి. ఈ చిట్కాలతో మన కళ్ల సమస్య కొంతవరకూ సమసిపోతుంది. మరి నేత్రవ్యాధులకి వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతైన అవసరం. ఇక చిన్న చిన్న కంటి వ్యాధులకి చిట్కాలు ఏమిటంటే మనకి ఏదో ఒకటి కంట్లో నలుసు పడుతూ వుంటుంది. దానితో మనం విపరీతంగా కన్ను నలిపేస్తూ వుంటాం. అదే పిల్లలయితే మరీ నలిపేస్తారు. గోలగోల చేస్తారు. అటువంటపుడు మనం కంగారు పడకుండా కన్ను నలపకుండా, ఒక గ్లాసునిండా నీరు తీసుకుని కన్ను అందులో మునిగేటట్టుగా వుంచి కన్ను రెప్పలు టపాటపా మూసి, తెరుస్తూ చేస్తే కంటిలో మనని చికాకు పరుస్తున్న ఆ చిన్న నలక నీటిలో జారిపోయి, మనకి ఉపశమనం కలుగుతుంది. ఒక్కొక్కసారి ఎలర్జీవల్ల కన్ను దానంతటదే ఎర్రబారి, మంటపుడుతూ ఉంటుంది. ఒక్కొసారి ఎలర్జీవల్ల కన్ను దానంతటదే ఎర్రబారి, మంటపుడుతూ ఉంటుంది. అటువంటప్పడు మనకి దగ్గర్లో చంటిపిల్ల తల్లి ఎవరైనా ఉంటే, చెంచాడు. చనుబాలు అడిగి కంటిలో వేయించుకుంటే ఆ ఎలర్జీ తగ్గి ఉపశమనం కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: